మేడ్చల్ జాతీయ రహదారి NH-44 విస్తరణ పనులను వెంటనే పునఃప్రారంభించి వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి మంగళవారం కోరారు. ఈ మేరకు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్ రావుతో సమీక్ష నిర్వహించారు. పాత కాంట్రాక్టర్ను తొలగించామని, కొత్త కాంట్రాక్టర్ నియామక ప్రక్రియ తుది దశలో ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచి పనులు వేగవంతం చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు.