"బస్తీ బాట" కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ లోని భవానినగర్ కాలనీలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ సోమవారం పర్యటించారు. కాలనీలో ఉన్న ప్రధాన సమస్యల గురించి తెలుసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.