హైదరాబాద్, అంబర్పేట్, ఉప్పల్ పరిధిలోని నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పుడమి హైస్కూల్లో చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. వికసిత్ భారత్–2047 అంశంపై విద్యార్థులు రూపొందించిన చిత్రాలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.