మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులని గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ కుమార్ గతంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తక్షణమే జీహెచ్ఎమ్సీ అధికారులను ఆదేశించడంతో శుక్రవారం డివిజన్ లో ఇంజనీరింగ్ అధికారులు ఈ ఈ నాగేందర్, డిఈ రూప, ఏ ఈ స్రవంతి పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.