నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల సీజ్

కీసరలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారంసీజ్ చేశారు. ప్రథమచికిత్స పేరుతో తెలిసి తెలియని వైద్యంతో ప్రజలకు చికిత్స చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. సుజాత, భాస్కర ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో AO వినోద్, సూపరిండెంట్ అక్షయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్