కాప్రా డివిజన్‌లో రూ. 4 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం...

ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా, వంపుగూడ డివిజన్లలో సుమారు రూ. 4 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఓపెన్ జిమ్‌ల వంటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్