తార్నాక: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నేడు ప్రమాణ స్వీకారం

మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శనివారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి భారీ ర్యాలీ గా బయలు దేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి దేవాలయంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్