జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా తార్నాక డివిజన్ సత్యనగర్ అంగన్వాడి సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అలాగే, పోషణ విలువల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.