ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని గత 30 ఏళ్లుగా తాము అలుపెరుగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ బద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.