డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిన్న ఓయూలో నిరసనలు తెలిపారు విద్యార్థులు. బుధవారం నిరసనల నేపథ్యంలో హాస్టల్లలో ఉన్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు చేశారు పోలీసులు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని, నిరుద్యోగులపై కొనసాగిస్తున్న దుర్మార్గపు ధమన కాండకు వ్యతిరేఖంగా నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, మిథున్ ప్రసాద్ లను అరెస్టు చేశారు ఓయూ పోలీసులు.