సంక్రాంతి సెలవుల్లో చోరీ... నిందితులు అరెస్ట్...

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి. జగన్ తెలిపారు. సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్