కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం: పుట్ట లక్ష్మణ్

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధనకు ఐక్యతే ప్రధాన బలం అని, సంఘటితంగా పోరాడితేనే తమ హక్కులను కాపాడుకోగలరని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాలు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితుల మెరుగుదల వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్