ఉప్పల్ రింగ్ రోడ్డుపై మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. ట్రాఫిక్ జామ్ సమయంలో ఆదివారం రాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టగా.. వారు రెచ్చిపోయి గొడవకు దిగారు. కింద నుంచి డోరు తీసి క్యాబ్‌లో ఉన్న ఐటీ ఉద్యోగులపై దాడికి ప్రయత్నించారు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోకిరీలు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.