మల్లాపూర్ డివిజన్, నెహ్రూనగర్ కాలనీలో 5.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. నెహ్రూనగర్ కాలనీలో మెరుగైన పారిశుధ్యాన్ని అందించే లక్ష్యంతో ఈ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తు న్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వేణుగోపాల్‌తో పాటు స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, నాగారం బాబు, నాగరం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.