ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, పనులు ఎన్నటికి పూర్తవుతాయోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.