ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన వజ్రేశ్ యాదవ్‌ను తెలంగాణ లేబర్ సెల్ వైస్ చైర్మన్ వి. ఎస్ ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి వజ్రేశ్ యాదవ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి. ఎస్ సాయి చరణ్ రెడ్డి, షరీఫ్ ఉద్దిన్, అజీమ్, సుధాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఉమ తదితరులు పాల్గొన్నారు.