విద్యా మారుతినగర్ డ్రైనేజీకి రూ. 21.5 లక్షల మంజూరు

చర్లపల్లి డివిజన్లోని విద్యా మారుతినగర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి రూ. 21.50 లక్షల నిధులు మంజూరయ్యాయని మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తెలిపారు. శనివారం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. డివిజన్లోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, డ్రైనేజీ నిర్మాణంతో కాలనీవాసుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధులు హైదరాబాద్, ఉప్పల్, అంబర్‌పేట్ పరిధిలోని విద్యామారుతినగర్ అభివృద్ధికి దోహదపడతాయి.

సంబంధిత పోస్ట్