మేడే వేడుకలో పాల్గొన్న వి ఎస్ ప్రకాష్ రెడ్డి....

నాచారం ఎర్రకుంట వద్ద మే డే సందర్భంగా కార్మిక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టిపిసిసి లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వి. ఎస్ ప్రకాష్ రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు సైనికుల వలె పనిచేసి యజమానులకు వేల కోట్లు సంపాదించిపెట్టినా, కార్మికులు మాత్రం అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మే డే దేశవ్యాప్తంగా కార్మికులకు పండగ లాంటి రోజు అని, కార్మికుల జీతాలు పెంచేలా యాజమాన్యాలు ఆలోచించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్