ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరిగిన ఎన్జీఓఎస్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికల సమావేశంలో, నాయకులు అబ్దుల్ ఖదీర్ ఖాన్, వెంకటేష్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. తమ ప్యానెల్ కు ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఅబ్దుల్ ఖాదర్ ఖాన్ ప్యానల్ మేనిఫెస్టోను విడుదల చేశారు.