నాచారం సుప్రభాత్ హోటల్ భోజనంలో పురుగులు...

నాచారం సుప్రభాత్ హోటల్‌లో భోజనంలో పురుగు కనిపించడంతో ఒక యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహేంద్ర అనే యువకుడు హోటల్‌లో 105 రూపాయలకు ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు. తనకు అందించిన భోజనంలో పురుగును గమనించిన యువకుడు హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్