సోమనాథ్ ఆలయం విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు నాచారం డివిజన్ నాయకులు, కార్యకర్తలు మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నాచారం చౌరస్తాలోని శ్రీ పార్వతి రాజమహేశ్వర ఆలయంలో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సోమనాథ్ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను, పునర్నిర్మాణ స్ఫూర్తిని స్మరించుకున్నారు.