వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేసారం నుండి చింతకుంటకు అంత్యక్రియలకు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.