పాత కక్షలతో కొట్టుకున్న దాయాదులు

పాత కక్షల నేపథ్యంలో బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో దాయాదుల కుటుంబాల మధ్య బుధవారం వివాహ వేడుకలో మాటామాట పెరిగి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. వీడియోల ఆధారంగా గొడవలో ప్రమేయం ఉన్న వారిని గుర్తిస్తున్నామని, కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ ఘటనతో కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

సంబంధిత పోస్ట్