దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం. జిల్లా కలెక్టర్.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్