వికారాబాద్ జిల్లాలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రమవుతున్నాయని, పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.