వికారాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో వేడి పెరిగి వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.