వికారాబాద్: హత్య కేసుగా మారిన మిస్సింగ్ కేసు

కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో అదృశ్యమైన 63 ఏళ్ల వెంకటమ్మ అనే వృద్ధురాలు నగదు ఆశతో పొరుగువారే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన బ్యాంకుకు వెళ్తానని చెప్పి బయలుదేరిన వెంకటమ్మ తిరిగి రాకపోవడంతో కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొరుగువారైన కుర్వ మంజుల, ఆమె భర్త భీరయ్య, బంధువు కలిసి వృద్ధురాలిని బైక్‌పై తీసుకెళ్లి, తిర్మలాపూర్ సమీపంలో గొంతు నులిమి హత్య చేసి, నగలు దోచుకుని, మృతదేహానికి నిప్పంటించినట్లు విచారణలో అంగీకరించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్