వికారాబాద్: విషాదం.. సంపులో పడి యువకుడు మృతి

వికారాబాద్ జిల్లా సత్రోనిపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు ప్రమాదవశాత్తు సంపులో పడి కాట్రావత్ బాలు నాయక్ (19) అనే యువకుడు మృతి చెందాడు. అయితే బాలు నాయక్ గత రెండేళ్లుగా తన అమ్మమ్మ ఊరైన సత్రోనిపల్లి తండాలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజూ మాదిరిగానే పని చేస్తూ నీరు తేవేందుకు సంపులోకి దిగిన బాలు నాయక్ ఈత రాకపోవడంతో అనుకోకుండా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్