హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జరిగిన 'షీల్డ్–2026' కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భద్రతా వ్యవస్థలో ఆధునిక సాంకేతికత ప్రాధాన్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో, ఒక రోబో డ్యాన్సర్‌తో పోటీపడుతూ అదిరిపోయే స్టెప్పులేసింది. టెక్నాలజీని సామాన్య ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రదర్శన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.