మంత్రి వివేక్‌పై ఆర్య వైశ్యుల ఆగ్రహం

తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మంత్రి వివేక్ వెంకట స్వామి ఆర్య వైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆదివారం కర్మన్ ఘాట్‌లో జరిగిన ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, అమరవాది లక్ష్మీనారాయణకు పదవి కల్పించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. మహాసభను భ్రష్టు పట్టించి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైశ్యులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్