హైదరాబాద్‌లో బాస్ఎఫ్ రెండు భారీ కేంద్రాలు: 3000 మందికి ఉద్యోగాలు

ప్రపంచ ప్రఖ్యాత రసాయన తయారీ సంస్థ బాస్ఎఫ్ (BASF) హైదరాబాద్‌లో రెండు భారీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (GCC) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)ను అందజేసింది. 'బాస్ఎఫ్ గ్లోబల్ డిజిటల్ హబ్', 'గ్లోబల్ సర్వీసెస్ హబ్' పేర్లతో ఈ కేంద్రాలు స్థాపించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఐటీ, డిజిటల్ సర్వీసెస్, కార్పొరేట్ సేవల రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది కాలంలో 100 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను తీసుకువచ్చి, లక్ష మందికి పైగా ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్