డంపింగ్ యార్డ్లో మంటలు.. అనారోగ్య బారినపడుతున్న స్థానికప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్‌లోని దుండిగల్ తండా–2 డంపింగ్ యార్డ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. చెత్తలో చెలరేగిన మంటల వల్ల దట్టమైన నల్లని పొగతో చుట్టుపక్కల ప్రాంతాలు కమ్ముకుపోయాయి. ఈ పొగతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, నల్లని పొగ కారణంగా శ్వాసకోశ సమస్యలు, కళ్లమంటలు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్