హైదరాబాద్‌: ఏకంగా 14 టన్నుల కుళ్లిన మాంసం పట్టివేత (వీడియో)

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పరిధిలో భారీగా కుళ్లిన మాంసం పట్టుకున్నారు. ఏకంగా 14 టన్నుల (14వేల కేజీలు) కుళ్లిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'A to Z' అనే గోదాంలో నిల్వ చేసిన మేక, గొర్రెల మాంసాన్ని సిటీలోని ప్రముఖ హోటళ్లు, చిన్న చిన్న దుకాణాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హరియాణా, యూపీ, మహారాష్ట్ర నుంచి మాంసం తెప్పించి అఫ్రోజ్‌ అనే వ్యక్తి స్టోర్ చేస్తున్నాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్