ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్టు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి తెలిపారు. గురువారం వివిధ ఆలయాలకు ప్రభుత్వం అందించే నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.