జపాన్ ప్రభుత్వం భారతదేశం నుండి మామిడి పండ్ల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. పండ్ల ఫ్యూమిగేషన్ మరియు నిల్వలో లోపాలు కనుగొన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్ వీహెచ్‌టి కేంద్రాన్ని తనిఖీ చేసిన జపాన్ క్వారంటైన్ ఇన్‌స్పెక్టర్లు కొన్ని సాంకేతిక లోపాలను గుర్తించారు. దీనివల్ల అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి ప్రధాన భారతీయ మామిడి రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు మామిడి ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి, ఈ నిర్ణయంతో ఎగుమతిలో భారీ నష్టం వాటిల్లుతుంది.