మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట పుణ్య క్షేత్రంలో కార్తీక మాసం మొదటి రోజున భక్తులు తెల్లవారుజాము నుంచే శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపం దర్శనంలో భక్తులు ఆసక్తి చూపారు. ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నారు.