బండ్లగూడలో న్యాయ విజ్ఞాన సదస్సు

బండ్లగూడలోని అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీ ఆధ్వర్యంలో జంగమ్మెట్ బస్తీలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిటీ సివిల్ కోర్టు జడ్జి కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పొందాలన్నారు. ముఖ్యంగా పోక్సో చట్టంపై విస్తృతంగా చర్చ జరగాలని, విద్యార్థులు సెల్ ఫోన్ల వినియోగం తగ్గించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్