హైదరాబాద్‌లోని దోమలగూడలో మీటర్ రీడర్ల మహా ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారిని రెగ్యులర్ చేయడం, కనీస వేతనం రూ.25,000 ఇవ్వడం వంటి డిమాండ్లపై ఆయన మద్దతు తెలిపారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.