కుర్మగూడలో వేగంగా అభివృద్ధి పనులు

కుర్మగూడ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని యాకుతుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. శుక్రవారం మాదన్నపేటలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ఆయన స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. రూ. 12.5 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను త్వరగా పూర్తి చేసి, రోడ్డును స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ షఫత్ అలీ కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్