కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. వేములవాడ, కొమురవెల్లి, యాదాద్రి, శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు మొత్తం 17 టూర్ ప్యాకేజీ బస్సులను నడపనున్నారు. ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్