సైదాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

బైక్ పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూసలబస్తీకి చెందిన ఇంద్రాన్ (22) బుధవారం తెల్లవారుజామున బస్తీలో తన బైక్పై వెళ్తుండగా మూడుగుళ్ల చౌరస్తా సమీపంలో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి, ఆ తర్వాత మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్