యాకుత్ పురా: అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేలా చూడాలని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. బుధవారం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా తరచూ రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు పర్యటించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మరోసారి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్