రంగారెడ్డి: మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలో ఎల్లంపల్లి పవన్ (25) అనే యువకుడు, కొత్త బైక్, మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ప్లంబర్‌గా పనిచేస్తున్న పవన్, గత కొంతకాలంగా ఇంట్లో వీటి కోసం పట్టుబడుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు కొనివ్వలేకపోయారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్