TG: హైదరాబాద్ మహానగరంలో అత్యంత శక్తివంతమైన ఏజెన్సీగా మారిన హైడ్రా (HYDRAA) పేరుతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఎన్‌ఓసీల ఆధారంగా గుర్తింపు పొందేందుకు 8 ప్రైవేటు కళాశాలలు ప్రయత్నించాయి. ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన ఈ నకిలీ సర్టిఫికెట్లను అధికారులు తనిఖీ చేయగా, అవి పూర్తిగా ఫేక్ అని తేలింది. ఈ వ్యవహారంపై అప్రమత్తమైన హైడ్రా యంత్రాంగం, ఫోర్జరీకి పాల్పడిన 8 కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్లే లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.