హైడ్రా నమ్మకాన్ని కోల్పోయింది: MP విశ్వేశ్వర్‌రెడ్డి

TG: రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన 'హైడ్రా' నమ్మకాన్ని కోల్పోయిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లు తీసుకొచ్చారని విమర్శించారు. ఎంఐఎం నేతల ఆక్రమణల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారన్నారు. ఎంఐఎంకు హైడ్రా భయపడుతోందని, ముస్లిం ఓట్లకు భయపడుతూ ఒవైసీ బ్రదర్స్‌ను నిరాశపర్చకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్