ఒలింపిక్‌ క్రీడాకారుడి తల్లిని హిప్నటైజ్‌ చేసి.. బంగారం చోరీ!

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఒలింపిక్ క్రీడాకారుడు సురాజ్ పన్వర్‌ తల్లి పూనమ్ పన్వర్‌ను హిప్నటైజ్ చేసి, దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చంద్రబానీ చౌక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న పూనమ్‌ను ఇద్దరు వ్యక్తులు కలిసి మాటల్లోకి దింపి, క్షుద్ర శక్తులపై పట్టుందని నమ్మించి, మంత్రాలు వేసి చెట్టు కిందకు తీసుకెళ్లి ఆమె పర్సులోని రూ.1,100 నగదు, ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్