భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనితో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేసి, క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తగ్గించింది. వినియోగదారులు తక్కువ ధరకు కారును కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం సబ్‌స్క్రిప్షన్ లేదా ఈఎంఐ ఎంచుకోవచ్చు. బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది.