దర్శకుడు, నటుడు హర్షవర్ధన్ తన చిత్రం 'మామా మశ్చీంద్ర' పరాజయానికి సుమారు 80 శాతం తన నిర్ణయాలే కారణమని అంగీకరించారు. ఈగోలు, తప్పుడు వ్యక్తులతో ప్రయాణం, ప్రొడక్షన్ బాధ్యతలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వంటివి ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. తన మొదటి దర్శకత్వ ప్రయత్నం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఇంకా విడుదల కాలేదని, సుధీర్ బాబుతో కలిసి చేసిన 'మామా మశ్చీంద్ర' విషయంలో పెద్ద బడ్జెట్ సినిమా బాధ్యతలను అర్థం చేసుకోలేకపోవడం తన తప్పిదమని, ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లడం పరాజయానికి దారితీసిందని తెలిపారు.