కాంగ్రెస్ పార్టీలోనే నాపై దుష్పచారం చేస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి

TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. సొంత పార్టీలోనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మునుగోడు అభివృద్ధే తనకు ప్రాధాన్యమన్నారు.

సంబంధిత పోస్ట్