టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ నేతలతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలుపొందిన తర్వాత నేరుగా పనైయూర్‌కు రావాలని, సంబరాల కోసం నియోజకవర్గాలకు వెళ్లవద్దని సూచించారు. తాను అక్కడే ఎదురుచూస్తూ ఉంటానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.